నిజామాబాద్ కార్పొరేషన్ కార్యవర్గ సభ్యులకు ప్రత్యేక బాధ్యతలు
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్
కేటాయించిన నిజామాబాద్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ
ఈ రోజు సోమవారం రోజున జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నిజామాబాద్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు బొబ్బిలి రామకృష్ణ ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. అందులో భాగంగా ఉపాధ్యక్షులను బ్లాక్ ఇంచార్గులుగా,ప్రధాన కార్యదర్శులను డివిజన్ ఇంచార్జులుగా,కార్యదర్శులను ప్రధాన కార్యదర్శులకు కో ఇంచార్జులుగా నియమించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి నుండి కమిటీలోని అందరూ సభ్యులు తమకు కేటాయించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని,తక్షణమే మీకు ఇచ్చిన బాధ్యతలను చేపట్టాలని అన్నారు.సభ్యులు తమకు కేటాయించిన బాధ్యతలతో డివిజన్ అధ్యక్షులను, డివిజన్ కమిటీలను,బూత్ ఏజెంట్లను,బూత్ కమిటీలను,సోషల్ మీడియా కో ఆర్డినేటర్లను నియమించాలని అన్నారు. ఇప్పడి నుండి ప్రతి డివిజన్ లో జరిగే ఏ కార్యక్రమమైన ఇంచార్జీల పర్యవేక్షణలో జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి నిజామాబాద్ కార్పొరేషన్ కార్యవర్గ కమిటీలోని ఉపాధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు,కార్యదర్శులు పాల్గొన్నారు.
