PS Telugu News
Epaper

మ్యాగ్నెట్ విద్యాసంస్థల అధినేతకు గౌరవ డాక్టరేట్ అవార్డు

📅 31 Mar 2026 ⏱️ 7:15 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ న్యూయార్క్ సంస్థ ఆధ్వర్యంలో అందజేత

అవార్డు అందుకున్న ఎండి వాజిద్ పాషా

( పయనించే సూర్యుడు మార్చి 31 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

షాద్నగర్ పట్టణంలోని మ్యాగ్నెట్ విద్యాసంస్థల అధినేత ఎండి వాజిద్ పాషా ను గౌరవ డాక్టరేట్ అవార్డు అందుకోవడం జరిగింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ న్యూయార్క్ సంస్థ నుండి గౌరవ డాక్టరేట్ ను మంగళవారం అందుకోవడం జరిగింది. అదేవిధంగా వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ యాక్టివ్ మెంబర్గా ఎండి వాజిద్ పాషా ను ఎన్నుకోవడం జరిగింది. అనంతరం ఎండి వాజిద్ పాషా మాట్లాడుతూ… ఈ డాక్టరేట్ రావడం ఎంతో సంతోషంగా ఉందని మరియు తనపై మరింత బాధ్యత పెరిగిందని తమ యొక్క రంగంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి సహాయపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని అన్నారు. అవార్డు రావడంతో విద్యాసంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Scroll to Top