సలేశ్వరం జాతరకు వెళ్లే వాహనాలకు టోల్ రుసుము తీసుకోవద్దు సామాజిక కార్యకర్త.H నరసింహ
{పయనించే సూర్యుడు} {ఏప్రిల్ 2 }
తెలంగాణ అమరనాథ్ యాత్ర గా ప్రసిద్ధి చెందిన సలేశ్వరం లింగమయ్య దర్శనానికి వెళ్లే భక్తుల వాహనాలకు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అధికారులు టోల్ రుసుము వసూలు చేయడం చాలా అన్యాయం అని సామజిక కార్యకర్త హెచ్. నర్సింహా ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. దేశంలో హిందువులు వారివారి దేవుళ్లకు,దేవతలకు పూజలు చేసి మొక్కులు చెల్లుచుకుందామంటే టోల్ రుసుము, వివిధ పూజల రుసుములు చెల్లించలేక సామాన్య భక్తులు దేవుళ్ళకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దేవాలయాల, దర్శనీయ స్థలాల పరిరక్షణ మరియు అభివృద్ధి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాహించాలని కోరారు. దేవాలయాల దగ్గర, దర్శనీయ స్థలాల దగ్గర హుండీ డబ్బులు, వివిధ రకాలుగా వసూలు చేసిన డబ్బులు దేవాలయాల అభివృద్ధి కోసం మాత్రమే ఉపయోగించే విధంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకోని రావాలని డిమాండ్ చేశారు. దేవుని భక్తుల డబ్బులు దేవుళ్ళకు, దేవతలకు మాత్రమే ఖర్చు చేయాలనీ తెలిపారు. దేవాలయాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వాలు వేరే పనులకు ఖర్చు చేయడం అన్యాయం అని అన్నారు. వేరే మతాల వాళ్ళ ధార్మిక స్థలాలలో వచ్చిన ఆదాయం వాటికీ మత్రమే ఖర్చు పెట్టినప్పుడు, హిందూ దేవాలయాల ఆదాయం వేరే పనులకు ఎందుకు ఉపయోగిస్తున్నరో చెప్పాలని కోరారు. టోల్ రుసుము పేరుతో, వివిధ పూజ పేర్లతో వసూలు చేసే రుసుములు రద్దు చేసినప్పుడే సామాన్య భక్తులు దేవుణ్ణి, దేవతలను దర్శించుకునే అవకాశం ఉంటుందని అన్నారు. సలేశ్వరం అటవీ శాఖ అధికారులు 2 వీలర్ కు 100,ఆటోలకు 300,కార్లు, జీపులకు 500,బస్సు, లారీలు, డీసిఎం లకు 1000రూపాయలు వసూలు చేయడం తగదు అని అన్నారు. వెంటనే ముఖ్యమంత్రి, మంత్రులు స్పందించి ఈ రుసుములు వసూలు చేయడం ఆపించాలని కోరారు.