సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌కు ఘన నివాళులు
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 18:కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలాజీనగర్ డివిజన్ కేపీహెచ్‌బీ టెంపుల్ బస్‌స్టాప్ వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేపీహెచ్‌బీ, బాలాజీనగర్ గౌడ సంఘం సభ్యుల ఆహ్వానం మేరకు కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి కార్యక్రమానికి హాజరై సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సర్వాయి పాపన్న గౌడ్ బహుజనుల ఆత్మగౌరవం, హక్కుల కోసం చేసిన పోరాటాన్ని పలువురు నాయకులు స్మరించుకున్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్యం శ్రీరంగం, బాలాజీనగర్ డివిజన్ అధ్యక్షులు రాజేష్ గౌడ్, కేపీహెచ్‌బీ డివిజన్ అధ్యక్షుడు అరవింద్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఫణీంద్ర, నాగమల్లేశ్వరరావు, రంగమోహన్, నితీష్ గౌడ్, మనీ గౌడ్, శ్రీధర్ చారి, గిరి నాయుడు, రామకృష్ణారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కళ్యాణ్ బాబు, దుర్గా ప్రసాద్, స్వరూప గౌడ్, పొన్నం రజిత గౌడ్ తదితరులతో పాటు గౌడ సంఘం సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సర్వాయి పాపన్న గౌడ్‌కు ఘన నివాళులర్పించారు.