భారతమాత ముద్దుబిడ్డ తొలి తెలుగు బహుజన చక్రవర్తి సర్వాయి పాపన్న గౌడ్ 376 వ జయంతి వేడుకల్లో పాల్గొన్న జనసేన నాయకులు: ప్రేమ కుమార్

August 18, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కెపిహెచ్ బి కాలనీ 3 వ ఫేస్ టెంపుల్ బస్ స్టాప్ వద్ద సర్వాయి పాపన్న గౌడ్ 376 వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమమునకు తెలంగాణ రాష్ట్ర గౌడ సంగ నాయకులు రాజేష్ గౌడ్, వినోద్ గౌడ్ ఆహ్వానం మేరకు కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కంటెస్టేడ్ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమకుమార్ ముఖ్య అతిథిగా హాజరై పాపన్న గౌడ్ చిత్రపట్టానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం గౌడ సంగ నాయకులు ప్రేమ కుమార్ ని శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొల్లా శంకర్, వేముల మహేష్, పోలబోయిన శ్రీనివాస్ ,గౌడ సంగ నాయకులు , సభ్యులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper