రేపు ఝరి బి గ్రామం లో గ్రామసభ
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి
అందరూ గ్రామసభకు హాజరుకండి ఇందిరమ్మ కమిటీ సభ్యుడు గైక్వాడ్ సాయినాథ్ ఝరి
నిర్మల్ జిల్లా తానూర్ మండలం లోని ఝరి బి గ్రామం లో జరిగే సభకు అందరూ రావాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పథకాల గురించి గ్రామ సభకు సంబంధించిన వివరాలు: తేదీ: 02-04-2026. ప్రధాన సంక్షేమ పథకాలు: రైతు భరోసా పథకం ఇందిరమ్మ ఇండ్లు మహాలక్ష్మి పథకం (మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ₹500/- గ్యాస్ సిలిండర్) సన్నరకం వద్ద కొనుగోళ్లకు బోనస్ చేయూత పథకం గృహ జ్యోతి (200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్) కళ్యాణలక్ష్మి / షాదీ ముబారక్ కొత్త రేషన్ కార్డులు, మొదలగు పథకాలు. కొత్త పథకాలు: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం. ఇంటర్మీడియట్ వరకు అల్పాహార పథకం. ఇంటర్మీడియట్ వరకు మధ్యాహ్న భోజన పథకం.దివ్యాంగులైన ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాల పంపిణీ. తీర్మానాలు:గ్రామ సమస్యల గుర్తింపు.సమస్యల ప్రాధాన్యతల నిర్ణయం. రిజిస్టర్‌లో నమోదు. గ్రామ సభ సభ్యులు, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, మహిళలు, రైతులు, యువత, SHG సభ్యులు పాల్గొంటారు.