పిండి పాళెం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి
పయనించే సూర్యుడు ఏప్రిల్ 3 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మండలం
పిండుపాళెంగ్రామం వద్ద గురువారం రాత్రి AP40ET1449 నంబర్ గల ఓవర్ స్పీడ్ కారు ఢీకొని మునస్వామి (45) అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డు దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతుడు వాకాడు మండలం వల్లమేడు గ్రామానికి చెందినవాడిగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నిసార్లు విన్నవించిన అధికార యంత్రాంగం స్పందించడం లేదు తడ బార్డర్ నుంచి సూళ్లూరుపేట టోల్ ప్లాంట్ దాకా రోజుకు ఒక మనిషి ఆక్సిడెంట్ రూపాన చనిపోతున్నారు దీనిని ఆపే నాధుడు ఎవరు ప్రతిరోజు ఈ చావులు చూడాల్సిందేనా ఇకనైనా యంత్రాంగం దీనిని పట్టించుకోని శాశ్విత పరిష్కారం ఆలోచించాలి ఈయాక్సిడెంట్స్ చావులను ఆపాలని చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు ప్రభుత్వ యంత్రాంగాన్ని వేడుకుంటున్నారు
