PS Telugu News
Epaper

భైంసా ప్రాంతీయ ఆసుపత్రిలో డి ఎం మరియు హెచ్ ఓ రాజేందర్ సర్ అధ్వర్యంలో 108 ఈఎంటి రోజును ఘనంగా జరుపుకోవడం జరిగింది

📅 03 Apr 2026 ⏱️ 4:45 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా జిల్లా మెడికల్ మరియు హెల్త్ అధికారి గారు, జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ కాశీనాథ్ గారు పాల్గొన్నారు. ప్రజలకు ప్రాణాధారం అయిన 108 సిబ్బంది .ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, వాహన చోదకులు అలాగే ఇతర సిబ్బంది పాల్గొని ప్రజలకు అందిస్తున్న సేవల ప్రాముఖ్యతను వివరించారు.
జిల్లా మెడికల్ మరియు హెల్త్ అధికారి డాక్టర్ రాజేందర్ గారు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందిస్తూ 108 అంబులెన్స్ సేవలు సమాజానికి ప్రాణాధారంగా నిలుస్తున్నాయని అన్నారు. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ సేవలు అందుబాటులో ఉండటం వల్ల ప్రమాదాలు, గుండెపోటు, మెదడు సంబంధిత వ్యాధులు, గర్భిణీ అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించి అనేక ప్రాణాలను కాపాడుతున్నట్లు వెల్లడించారు. సంఘటనా స్థలంలోనే ప్రాథమిక చికిత్స అందించి బాధితులను స్థిరపరిచి సమీప ఆసుపత్రులకు తరలించడం ద్వారా అత్యవసర వైద్య సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రమాదాలు జరిగిన వెంటనే సమయానికి చికిత్స అందించడం వల్ల అనేక ప్రాణాలు రక్షించబడుతున్నాయని తెలిపారు. జిల్లాలో గత ఒక సంవత్సరంలో మొత్తం 31,977 అత్యవసర ఘటనలకు 108 అంబులెన్స్ సేవలు అందించాయని 108 ఈఎంటి లక్ష్మణ్ తెలిపారు. ప్రమాద బాధితులు, గర్భిణీలు, గుండె, ఇతర అత్యవసర వ్యాధులతో బాధపడుతున్న వారికి సమయానుకూలంగా వైద్య సహాయం అందించడంతో వేలాది మంది లబ్ధి పొందినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ, అత్యవసర కాల్ వచ్చిన వెంటనే కొద్ది నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకుని అవసరమైన చికిత్స అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా వెంటనే 108 సేవలను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో నిర్వాహక అధికారి జనార్ధన్ మాట్లాడుతూ, జిల్లాలో 108 అంబులెన్స్ సేవలు ప్రజలకు అత్యంత అవసరమైన సమయంలో ప్రాణాధారంగా నిలుస్తున్నాయని అన్నారు. అత్యవసర వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేస్తూ అనేక ప్రాణాలను కాపాడుతున్నారని తెలిపారు. అత్యవసర వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నిర్మల్‌ జిల్లా మెడికల్ అధికారి మరియు హెల్త్ అధికారి రాజేందర్ జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ కాశినాథ్ , డాక్టర్ విజయనగరం సార్ , డాక్టర్ అనిల్ డాక్టర్ కైలాస్ ,108 సిబ్బంది లక్ష్మణ్ పూజారి, నర్సయ్య, ఖాజమొయినొద్దిన్ , అనిల్ గంగాదర్ లు పాల్గొన్నారు.

Scroll to Top