PS Telugu News
Epaper

కొల్పూర్ మండల ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

📅 04 Apr 2026 ⏱️ 3:41 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

{ పయనించే సూర్యుడు} {న్యూస్ ఏప్రిల్ 5}

మాగనూర్ మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కొల్పూర్ – పాఠశాలలో ఈ రోజు స్వయం పరిపాలన దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రను స్వీకరించి వివిధ తరగతుల్లో బోధన నిర్వహించి తమ ప్రతిభ పాఠవాలను,నాయకత్వ మరియు నిర్వహణ సామర్థ్యాలను ప్రదర్శించారుఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిమ్మన్న మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో మంచి పౌరులుగా నాయకులుగా ఎదగడానికి స్వయం పరిపాలన దినోత్సవం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు ఏ ఏ పి సి ఛైర్మన్ నెహ్ర బేగం గారు మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల నిర్వహణ బోధన క్రమశిక్షణ వంటి అంశాలను సమర్థంగా నిర్వహించారు అని కొనియాడారు గ్రామ సర్పంచ్ ముద్దు రాములు మాట్లాడుతూ విద్యార్థులకు చక్కని వాతవరణంలో మంచి కార్యక్రమంను ఏర్పాటు చేసిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు 4వ వార్డు మెంబెర్ శిరీష మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్ లో కూడ మంచి స్థాయిలో ఉండేందుకు స్వయం పరిపాలన దినోత్సవం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామ సర్పంచ్, ఏ ఏ పి సి ఛైర్మన్, వార్డ్ మెంబెర్స్, పాఠశాల ఉపాధ్యాయులు అందజేశారు స్వయం పరిపాలన దినోత్సవంలో లో భాగంగా కలెక్టర్ శ్రీమను డి ఈ ఓ గా అఖిల్ ఎంఈఓ గా- ప్రకాష్ సి హెచ్ ఎం గా -శైలజ ప్రధానోపాధ్యాయులు గా -శిరీష మరియు వివిధ విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు ఈ కార్యక్రమం లో వివిధ పాఠశాల ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Scroll to Top