జర్నలిస్ట్ (ఖాజా పాషా) కేపీకి నా సినిమాల్లో అవకాశం
ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్..
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 06 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
జైలులో పెట్టి నిర్బంధించారు.. కేసులు పెట్టి వేధించారు.. అయినా పట్టువదలని విక్రమార్కుడులా ముందుకు సాగుతూనే ఉన్నాడు.. జర్నలిస్ట్ ఖాజపాషా (కేపీ) మొండోడు.. ఎవరి మాట వినడు.. అంటూ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ప్రశంసించారు. షాద్ నగర్ సీనియర్ జర్నలిస్ట్ కేపీ, శ్యామల దంపతుల జన్మదినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ నిర్మాత బండ్ల గణేష్ జన్మదిన వేడుకల సందర్భంగా మాట్లాడుతూ.. షాద్ నగర్ కంట్రీ సైడ్ క్లబ్ రిసార్ట్ లో ఏర్పాటుచేసిన జన్మదిన వేడుకల సందర్భంగా మాట్లాడుతూ.. భవిష్యత్తులో కేపి రాష్ట్ర స్థాయిలో నాయకుడు అయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని అన్నారు. భవిష్యత్తులో తన సినిమాలో జర్నలిస్ట్ కేపీకి తప్పకుండా అవకాశం ఉంటుందని అన్నాడు. అనుకున్న లక్ష్యం కోసం ప్రాణాలను కూడా లెక్కచేయని కేపీ లాంటి వ్యక్తులను కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత అందరి పైన పైన ఉందన్నారు. కేపీలో ఎన్నో కలలు దాగి ఉన్నాయని, అతనికి మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రశంసించారు. కేపీ లాంటి వ్యక్తులకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని, ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తదితర మిత్ర బృందం ఎల్లప్పుడు తనకు అండగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొనడం విశేషం. జర్నలిస్ట్ కెపికి ఉన్న ప్రతిభ వల్ల అతనికి తన సొంత సినిమాల్లో తప్పకుండా అవకాశం కల్పిస్తానని స్పష్టం చేశారు.
