మా గ్రామానికి స్మశాన వాటిక ను ఏర్పాటు చేయండి మహాప్రభో
పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 (సూళ్లూరుపేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు)
తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం లో పూల తోట గ్రామం ఏర్పడి 60 ఏళ్లు పైబడుతోంది, 100 దళిత గృహాలు కాపురం ఉంటున్నారు. మా దళిత వాడకు అన్ని మౌలిక వసతులు ఉన్నా ఆ గ్రామంలో
ఎవరు చనిపోయిన భూస్థాపితం చేసేందుకు స్మశాన వాటిక లేక కన్నా కాలువ గట్టు పక్కనే ఖననం చేసుకోవాల్సిన దుర్భిక్ష పరిస్థితి ఉందని ఆ గ్రామానికి చెందిన ప్రతాప్ దొరవారి సత్రం మండల తాసిల్దార్ శైల కుమారికి పి జి ఆర్ ఎస్ లో ఫిర్యాదు చేశారు. స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్న దళిత గ్రామానికి నిర్దిష్ట ప్రాంతంలో సరియైన స్మశాన వాటిక ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని విన్నవించారు. చనిపోయిన ఏ వ్యక్తినైనా ఖననం చేయడానికి సాగునీటి కన్నా కాలువే స్మశాన వాటికగా శవాలని పూడ్చు కోవలసిన పరిస్థితి ఉందని వివరించారు.ఎందరో ప్రజాప్రతినిధులు సూళ్లూరు పేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర పాలకులు ఎందరో వచ్చి పోయారు, కానీ దళితులకు నేటికీ కనీస సౌకర్యమైన స్మశాన వాటికను ఏర్పాటు చేయలేకపోయారని వాపోయారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యపై దృష్టి సాధించి నిర్ణీత ప్రాంతంలో స్మశాన వాటిక స్థలం కేటాయించాలని కోరడం జరిగింది. అంతేకాకుండా మండల పరిధిలోని ప్రజలు అత్యధికంగా భూ సమస్యలపై ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గోవర్ధన్ రెండు మూడు శాఖల అధికారులు మాత్రమే హాజరయ్యారు.
