PS Telugu News
Epaper

గుడి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని గ్రామస్తుల ధర్నా

📅 08 Apr 2026 ⏱️ 6:30 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

తాసిల్దార్ హామీతో ధర్నా విరమించిన గ్రామస్తులు

పయనించే సూర్యుడు: :ఏప్రిల్9 మక్తల్:

నిర్వాసిత గ్రామం పునః నిర్మాణం కోసం ప్ర‌భుత్వం ఇచ్చిన భూమిలో గ్రామ‌స్తులంద‌రూ గుడి క‌ట్ట‌డానికి వెళ్తే పోలీసులు అభ్యంత‌రం చెప్ప‌డంతో గార్ల‌ప‌ల్లి గ్రామ‌స్తులు అంబేద్క‌ర్ చౌర‌స్తాలో బైఠాయించి రాస్తారోకో నిర్వ‌హించారు. స‌మ‌స్య ప‌రిష్కారం కోసం త‌హశీల్దార్ ను క‌లిస్తే..స‌రిపోతుంద‌ని ఎస్సై భాగ్య‌ల‌క్ష్మీ రెడ్డి చెప్ప‌డంతో త‌హ‌శీల్దార్ కార్యాల‌యం వ‌ద్ద గ్రామ‌స్తులు బైఠాయించ‌డంతో రెండు రోజుల్లో స‌ర్వే చేసి హ‌ద్దులు నిర్వ‌హిస్తామిన త‌హ‌శీల్దార్ స‌తీష్ కుమార్ హామీ ఇచ్చారు. దీంతో గ్రామ‌స్తులు ధ‌ర్నా విర‌మించారు. మ‌క్త‌ల్ మండ‌లంలో సంగంబండ రిజ‌ర్వాయ‌ర్ లో గార్ల‌ప‌ల్లి గ్రామం ముంపున‌కు గురైంది. పునః నిర్మాణం కోసం ప్ర‌భుత్వం 169, 170 స‌ర్వే నెంబ‌ర్ల‌లో 24 ఎక‌రాల 14 గుంల భూమిని ఆర్ఆర్ సెంట‌ర్ కి కేటాయించిందని
అందులో ఇళ్ల నిర్మాణంతో పాటు బ‌డి, గుడి, ప‌బ్లిక్ ప‌ర్ప‌స్ కి సంబంధించిన నిర్మాణాలు చేప‌ట్టాల‌ని నిబంధ‌న‌లున్నాయి. అయితే త‌మ గ్రామ దేవ‌త ల‌క్ష్మీదేవి దేవాల‌య నిర్మాణం చేసుకోవాల‌ని ఇటీవ‌ల భూమి పూజ చేసి, నిర్మాణ ప‌నులు ప్రారంభించారు. నిర్వాసిత గ్రామ స‌ర్వే నెంబ‌ర్ కి ప‌క్క పొలం వ్య‌క్తి త‌మ పొలాన్ని ఆక్ర‌మించుకున్నార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు గ్రామ‌స్తుల‌ను బెదిరించ‌డం.. రాజ‌కీయ జోక్యం తోడైంద‌ని గ్రామ‌స్తులు త‌హ‌శీల్దార్ కి విన్న‌వించారు. రెండు రోజుల్లో స‌ర్వే చేసి హ‌ద్దులు నిర్ణ‌యిస్తామ‌ని.. అప్ప‌టి వ‌ర‌కు ఇరు వ‌ర్గాల వారు గొడ‌వ ప‌డ‌కుండా ఉండాల‌ని తహసిల్దార్ సూచించారు

Scroll to Top