PS Telugu News
Epaper

అట్టడుగు వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం – షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

📅 08 Apr 2026 ⏱️ 6:52 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

ఏం.బి.సి కులాల అభివృద్ధి కార్పొరేషన్ పై సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్

( పయనించే సూర్యుడు ఏప్రిల్ 09 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

తెలంగాణ అసెంబ్లీ లో ఏం.బి.సి కులాల అభివృద్ధి కార్పొరేషన్ అమలు చేస్తున్న పథకాల పైన షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సంస్థల ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ నేతృత్వంలో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.తెలంగాణ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్,రజక ఫెడరేషన్ కార్పొరేషన్ లు అమలుచేస్తున్న పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ…రాష్ట్ర వ్యాప్తంగా 36,526 మంది నాయి బ్రాహ్మణుల మాత్రమే ఉచిత విద్యుత్తు లబ్ధిదారులు ఉండటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న కానీ సంక్షేమ పథకాలు లబ్దిదారులకు అందడం లేదని అన్నారు.అదేవిధంగా వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కావున ప్రభుత్వం కేటాయిస్తున్న బడ్జెట్ ను వినియోగించుకొని ప్రజలకు చేరేటట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న ఉన్నత అధికారులపై ఉందని తెలిపారు. అందుకు అనుగుణంగా వివిధ పథకాలను ఎలాంటి అవరోధాలు లేకుండా అమలు చేసే బాధ్యత తీసుకోవాలని కోరారు. అందుబాటులో ఉన్న బడ్జెట్ ల్యాప్స్ కావటం జరగకూడదని అన్నారు. అతి త్వరలో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో బీసీ ఏ ఉప కులాలతో నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించి వారి ఆర్థిక స్థితిగతులపై నివేదిక తీసుకొని ఆ ఉప కులాలకు ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో శాసన సభ్యులు తోట లక్ష్మీకాంత రావు,పట్లోల సంజీవ రెడ్డి,బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మాయాదేవి,బీసీ సంక్షేమ శాఖ చీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ అలోక్ కుమార్, బీసీ ఫైనాన్స్ కమిషన్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లయ్య భట్టు,నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఇందిరా, అసెంబ్లీ డిప్యూటీ సెక్రెటరీ రఘుమ రెడ్డి, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ మాధవి, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top