PS Telugu News
Epaper

పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్-2026

📅 09 Apr 2026 ⏱️ 4:16 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి

పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ శిక్షణ 2౦26 కార్యక్రమంలో భాగంగా నేడు నిర్మల్ జిల్లాలోని ముధోల్ నియోజకవర్గంలోని 4 మండలాల ప్రశిక్షణ తరగతుల్లో ముధోల్ ఎమ్మెల్యే రామరావు పటేల్ ,బీజేపీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ పాల్గొని,ప్రసంగించడం జరిగింది.సంస్థ పట్ల నిబద్ధత, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ప్రజలతో సాన్నిహిత్యం వంటి అంశాలపై సమగ్ర మార్గనిర్దేశం అందిస్తూ బూత్ స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడమే ప్రధాన ఉద్దేశ్యం.భవిష్యత్ రాజకీయ, సామాజిక సవాళ్లను ఎదుర్కొనేలా కార్యకర్తలను తీర్చిదిద్దుతూ సమర్థవంతమైన నాయకత్వాన్ని రూపొందించేందుకు ఈ కార్యక్రమం ఒక బలమైన వేదికగా నిలుస్తుంది.పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆలోచనలు, అంత్యోదయ సూత్రం, సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరేలా పార్టీ కార్యకర్తలు కట్టుబడి పని చేయాల్సిన అవసరాన్ని వివరించడం జరిగింది. ఈ ప్రశిక్షణ కార్యక్రమానికి వక్తలుగా బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ , రవి పాండే ,నగర్ నారాయణ రెడ్డి , జిల్లా ప్రధాన కార్యదర్శి యాతాళం చిన్నారెడ్డి , జిల్లా ఉపాధ్యక్షులు గాలి రవి , నల్లా రమేష్ , తాడేవార్ సాయి నాథ్ , పట్టణ అధ్యక్షులు రావుల రాము గ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top