ఘనంగా ఎన్ ఎస్ యు ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం లో
ఎన్ ఎస్ యు ఐ (నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా) 56వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని భీమ్‌గల్ పట్టణంలోని బస్టాండ్ వద్ద ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ రెహమాన్ ఆధ్వర్యంలో ఎన్.ఎస్.యు.ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భీమ్‌గల్ మున్సిపల్ చైర్ పర్సన్ బొదిరే. నాగమణి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొదిరె.స్వామి,జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఆరేపల్లి నాగేంద్రబాబు ముఖ్య అతిధులు హాజరయ్యారు. ముందుగా భీమ్‌గల్ మున్సిపల్ చైర్ పర్సన్ బొదిరే.నాగమణి,మండల అధ్యక్షుడు స్వామి, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నాగేంద్ర ఎన్ ఎస్ యు ఐ యువకులతో కలిసి జెండా ఎగరవేయడం జరిగింది.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొదిరె.స్వామి మీడియాతో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, స్వేచ్ఛ, నాణ్యమైన విలువల ఆధారంగా బాధ్యత యుతమైన పౌరులు, నాయకులను రూపొందిం చేందుకు విద్యార్థి సమాజానికి సాధికారత కల్పించాలనే లక్ష్యంతో, కేరళ విద్యార్థి సంఘం, పశ్చిమ బెంగాల్ ఛత్ర పరిషత్‌లను విలీనం చేస్తూ 1971లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎన్.ఎస్.యు.ఐ ని ఏర్పాటు చేశారని, నేడు ఎన్ ఎస్ యు ఐ దేశంలోని అతిపెద్ద విద్యార్థి సంఘం గా ఉంది అని ఆయన అన్నారు.ఎన్ ఎస్ యు ఐ ప్రతి ఒక్క విద్యార్థికి విద్యార్థి దశ నుండే ప్రశ్నించే తత్వం సమస్యలపై పోరాడే తత్వం నాయకత్వ లక్షణాలను పెంపొందించి వారిని గొప్ప పౌరులుగా తీర్చి దిద్దుతుందని. ఎన్.ఎస్.యు.ఐ లో సంఘంలో పని చేసి ఎందరో కేంద్ర, రాష్ట్ర స్థాయిలో గొప్ప గొప్ప పదవులు అధిరోహించారని బొదిరే. స్వామి అన్నారు. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి రాష్ట్ర ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షుడిగా పనిచేశారని అక్కడి నుండి అంచలం చెలుగాగా ఎదిగి ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడుగా ఎమ్మెల్సీ కొనసాగుతున్నారని, మాజీ ఎన్ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ విద్యార్థి నిరుద్యోగులు పక్షాన గలమెత్తి బి.ఆర్.ఎస్ ప్రభుత్వం పై నిరంతర పోరాటం చేసినందుకుగాను అధిష్టానం ఆయన కష్టాన్ని గుర్తించి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిందని, అలాగే మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో సైతం అనేకమంది ఎన్ ఎస్ యు ఐ లో పనిచేసిన వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారని ఈ సందర్భంగా బొదిరే.స్వామి గుర్తు చేశారు. ప్రతి ఒక్కరు విద్యార్థి దశ నుండే ఎన్ ఎస్ యు ఐ లో పనిచేయాలని తద్వారా సామాజిక రాజకీయ స్పృహ విద్యార్థులలో, యువకులలో పెంపొందుతుందని ఆయన అన్నారు. అలాగే ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ రెహమాన్ మాట్లాడుతూ, ఎన్.ఎస్.యు. ఐ సంఘంలో పని చేసే ప్రతి ఒక్కరూ విద్యారంగ సమస్యల పై అలాగే నిరుద్యోగ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూనే ఉండాలని అలాగే సమాజంలో జరిగే సామాజిక రాజకీయ ఆర్థిక విషయాలపై ఎల్లవేళలా అధ్యయనం చేస్తూ సమస్యల పై పోరాటం చేయాలని ఈ సందర్భంగా సయ్యద్ రెహమాన్ పిలుపు నిచ్చారు ,ఎన్ ఎస్ యు ఐ విద్యారంగ సమస్యలపై విస్తృతంగా పోరాటం సాగిస్తూ ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలతో పాటు విశ్వ విద్యాలయాల్లోని సమస్యల పట్ల ఎప్పటి కప్పుడు వాళ్ల గళాన్ని వినిపిస్తూ విద్యారంగ అభ్యున్నతి తో పాటు సమసమాజ స్థాపన కోసం అహర్నిశలు శ్రమిస్తుందని ఆయన అన్నారు.కావున ప్రతి ఒక్క విద్యార్థి ఎన్ ఎస్ యు ఐ లో చేరి విద్య రంగ సమస్యలపై విద్యార్థులు పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బద్ది.అవినాష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు పర్స అనంతరావు, వార్డ్ కౌన్సిలర్ బాదావత్ సంగ్యనాయక్,12వ వార్డు ఇంచార్జ్ సుంకరి సురేష్, ముచ్కూర్ శాఖ అధ్యక్షుడు గట్టు మురారి, మహేష్, ముండి దినేష్, ఎన్ ఎస్ యు ఐ యువకులు అదనాన్,అక్షయ్, శివ, యశ్వంత్, ముత్యం, రంజిత్, ప్రశాంత్, మనీ,రామ్ చరణ్, సాగర్, చరణ్,భార్గవ్, రిషి అంజి, షాజీ, బబ్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
