ప్రభుత్వ జూనియర్ కళాశాలను యధాస్థితిలోనే కొనసాగించాలి.

August 19, 2026 | తెలంగాణ

నూతన భవన నిర్మాణం కోసం తాత్కాలిక తరలింపు చేపట్టాలి.

మైదానం కోసం కళాశాలను తరలించడం విడ్డూరం-చదువుల తర్వాతే ఆటలు.

నూతన భవన నిర్మాణంలో ఉర్దూ మీడియం ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం అదనపు గదుల నిర్మాణం చేపట్టాలి.

పయనించే సూర్యుడు ఆగస్టు20 మక్తల్ పట్టణ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్తిగా శిథి లావస్థలోకి చేరిందని. కనీసం మూత్రశాలలు లేని పరిస్థితుల్లో 600 మంది విద్యార్థులు కళాశాలలో చదువుకుంటున్నారని మానవ హక్కుల సంఘం కార్యకర్త మద్దిలేటి అన్నారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల చదువుపై పాలకుల నిర్లక్ష్య వైఖరి వీడి నూతన భవనం నిర్మాణం చేయడంతో పాటు కళాశాల భూములను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా లక్షలాది మంది విద్యార్థులు ఇందులో చదువుకొని ఎంతోమంది ఉన్నత స్థానంలో ఉండడమే కాకుండా అన్ని రంగాల్లో కూడా విస్తరించారని తెలిపారు.శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన భవనం నిర్మించి ఇవ్వాలని చాలా కాలంగా ప్రజలు, ప్రజా సంఘాల, విద్యార్థి సంఘాల డిమాండ్ కొనసాగుతూనే ఉన్నది.ఈ క్రమంలో కోట్లాది రూపాయల విలువచేసే ప్రభుత్వ జూనియర్ కళాశాల భూములపై అనేకమంది కన్నువేశారని. వారికి వత్తాసుగా పాలకవర్గాలు, అధికారులు భూముల పరిరక్షణపై నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారని ఎద్దేవ చేశారు. ప్రభుత్వం జూనియర్ కళాశాలను అక్కడి నుండి శాశ్వతంగా తొలగించి ఆ ప్రాంతాన్ని మొత్తం క్రీడామైదానంగా మారుస్తామని ప్రజా ప్రతినిధులు చెబుతూ వస్తున్నారు. కానీఇది ముమ్మాటికి పేద విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగించడమే తప్ప మరొకటి కాదన్నారు. పేదల చదువుపై ఏమాత్రం ప్రేమ ఉన్న పాలకవర్గాలు యదాస్థితిలోనే భవన నిర్మాణాన్ని కొనసాగించి, తాత్కాలిక వెసులుబాటు కోసం తరలించాలనీ తెలియజేశారు.చదువుల తర్వాతే ఆటలు, చదువులు లేని ఆటలు మనిషి అభ్యున్నతికి ఉపయోగపడవని ఈ విషయాన్ని పాలకులు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. కావున క్రీడా మైదానం కంటే కూడా నూతన కళాశాల విశాల గదులు, ప్రశాంత వాతావరణము సకల సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా నిధులు మంజూరు చేసి యధాస్థితిలోనే నూతన భవన నిర్మాణం చేపట్టాలని కోరారు. అలాగే ఉర్దూ మీడియం కళాశాలకు కూడా నూతన గదుల నిర్మాణం చేపట్టాలని సూచించారు.కళాశాల భూములను భవిష్యత్తు తరాలకు అందించాలని, ఆ భూముల పరిరక్షణకై చిత్తశుద్ధితో ముందుకు రావాలని డిమాండ్ చేశారుకోట్ల విలువచేసే కళాశాల భూములను కబ్జాదారుల నుండి కాపాడుతూ, కళాశాలను తరలించే ప్రక్రియ వెంటనే మానుకోకపోతే విస్తృత ప్రజా విద్యార్థి ఉద్యమాల ద్వారా కళాశాలను, కళాశాల భూములను కాపాడుకుంటామని హెచ్చరించారు.

🌐 Select Language:
📰 ePaper