PS Telugu News
Epaper

గ్రామదేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లి గ్రామసందర్శన

📅 11 Apr 2026 ⏱️ 4:04 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 ముమ్మిడివరం ప్రతినిధి

కాట్రేనికోన శ్రీ మావుళ్ళమ్మ తల్లి జాతర తీర్థ మహోత్సవ వాలు సందర్భంగా శుక్రవారం అమ్మవారి కి గరగ ఎత్తే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం ముందుగా ఆలయ అధ్యక్షులు ఆణి విళ్ళ సాయిబాబా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఆణి విళ్ళ ఫణి కాంత్ శాస్త్రి ఆధ్వర్యంలో తొలుత వినాయకునిపూజ,అమ్మవారికి గరగ ల పూజ నిర్వహించారు.బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఆకొండి మహేష్ శర్మ చే తొలుత కొబ్బరికాయ కొట్టించి అనంతరం పి ఎస్ఎన్ రాజు(విలేకరరాజు) , గ్రంధి సురేష్ మట్ట సూరిబాబు చేతుల మీదుగా ఆలయ ప్రధాన ఆశాదులు మందపల్లి మహేష్ మరియు వారి కుమారులు మందపల్లి సూర్య,వీర పండు లకు అమ్మవారి గరగ లను అంద చేసిరి.ఈ సందర్భంగా విలేకర రాజు అమ్మవారికి చీర ,సారే సమర్పించారు.విశిష్ట అతిథులు
చేతుల మీదుగా అమ్మవారికి పల్లకి సేవ కార్యక్రమం ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణాలతోటి నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆణి విళ్ళ రామకృష్ణ పరమహంస, బాలశ్రీనివాసు,పవన్,ఆకొండి అంజి,శ్రీకాంత్,గ్రంధి రాంప్రసాద్,సానబోయిన సూరిబాబు, యల్లమిల్లి కరుణ, సంసాని రాంబాబు , తాతపూడి బుల్లి, పలువురు డప్పు వాయిద్య కళాకారులు , తదితరులు పాల్గొన్నారు.ఆలయ అధ్యక్షులుఆణి విళ్ళ సాయిబాబా ఈ నెల 28వ తారీకు మంగళవారం నాడు అమ్మవారి తీర్థ మహోత్సవం జరుగును అని తెలిపిరి.

Scroll to Top