PS Telugu News
Epaper

ఘనంగా మహాత్మ పూలే 199వ జయంతి

📅 11 Apr 2026 ⏱️ 4:48 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

స్త్రీ విద్య,స్వేచ్ఛ సమానత్వానికి నాంది మహాత్మా జ్యోతిబాపూలే

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం,మక్తల్

మహాత్మ పూలే దంపతుల విగ్రహావిష్కరణ కమిటీ

{పయనించే సూర్యుడు} {ఏప్రిల్12మక్తల్ }

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ మరియు మహాత్మ పూలే దంపతుల విగ్రహావిష్కరణ కమిటీ ఆధ్వర్యంలో మక్తల్ పట్టణంలోని మహాత్మ పూలే చౌరస్తాలో ఏర్పాటు చేసిన పూలే జయంతి సందర్భంగా వైస్ చైర్మన్ వాకిటి మానస హనుమంతు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులు మాట్లాడుతూ.మహారాష్ట్రలో పుట్టిన మహాత్మ జ్యోతిబాపూలే బ్రిటిష్ పాలన కాలంలో క్రైస్తవ మిషనరీలలో చదువుకొని,అ ఆనాడు దేశంలో తన వర్గాల ప్రజలు బానిసత్వంలో బతకడానికి శాస్త్రీయమైన అగ్రవర్ణ బ్రాహ్మణీయ మనువాదమే కారణమని గ్రహించాడన్నారు.ముఖ్యంగా మహిళలకు,నిమ్న వర్గాలకు విద్యను నిరాకరించిన ఆకాలంలో తన భార్య సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి 1848 – 1852 మధ్యకాలంలో 20 పాఠశాలలను నెలకొల్పి వారికి విద్యనందించిన మహానీయుడు జ్యోతిబాపూలే దంపతుల విగ్రహల ఆవిష్కరణకు ఆర్థికంగా అందరు సహకరిస్తున్నారని ఈ నెలలోపే విగ్రహాల ఆవిష్కరణను చేపడతామన్నారు.అంతేకాకుండా సతీసహగమనానికి, మనువాద నీచ సంస్కృతికి వ్యతిరేకంగా 1873లో సత్యశోధక సమాజం స్థాపించి వితంతువులకు మళ్లీ పెళ్లి చేయించడం,గర్భిణీ వితంతువులకు ఆశ్రయం కల్పించడం, కులాంతర వివాహాలు జరిపించడం ఇలా అనేక కార్యక్రమాలతో సమాజంలో పెనుమార్పులకు కేంద్ర బిందువుగా మారిన మహాత్మ జ్యోతిరావు పూలేను భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురువుగా ప్రకటించుకున్నాడన్నారు.
అదే విధంగా తాను రాసిన గులాంగిరి పుస్తకం ద్వారా బ్రాహ్మణీయ భావజాల కట్టుకథల దశావతారాల గుట్టును బట్టబయలు చేసి, ప్రజలల్లో శాస్త్రీయ ఆలోచన విధానానికి పునాదులు వేశాడన్నారు.దేశంలో మొట్టమొదటిసారిగా రాజ్యాధికారాన్ని చేపట్టిన బహుజన చక్రవర్తి చత్రపతి శివాజీ మహారాజ్ సమాధిని కనిపెట్టి, గొప్పతనాన్ని జానపద గేయాల రూపంలో ఊరువాడ వినిపించి బహుజనుల్లో రాజ్యాధికారకాంక్షకు స్ఫూర్తినిచ్చాడన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ అధ్యక్షులు పృధ్విరాజ్,పూలే దంపతుల విగ్రహావిష్కరణ కమిటీ నాయకులు అడ్వకేట్ దత్తాత్రేయ,తెలంగాణ ఉద్యమకారుడు మానవ హక్కుల కార్యకర్త మద్దిలేటి,బీసీ ఐక్యవేదిక రామాంజనేయులు గౌడ్, బానస నాయకులు పోలప్ప, జీర్గల్ నగేష్ విజయ్ కుమార్ గోలపల్లి నారాయణ మక్తల్ మున్సిపాలిటీ చైర్మన్ వాకిటి మానస హనుమంతు, కౌన్సిలర్లు చెన్నమ్మ నీలప్ప, కర్రెం మహేష్, శ్రీవిద్య నీల గౌడ్,ముష్టిపల్లి వెంకటేష్,శంకర్,కో ఆప్షన్ మెంబర్లు లక్ష్మణ్,షంషొద్దీన్, మార్కెట్ డైరెక్టర్ ఫయాజ్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కట్ట సురేష్,గొల్లపల్లి నారాయణ, అడ్వకేట్ ఆడెం శ్రీనివాసులు, బిఆర్ఎస్ నాయకులు మొగలప్ప,ఎరుకలి సంఘం వెంకటయ్య, అబ్దుల్ బాయ్,అంబేద్కర్ సంఘం కార్యదర్శి బండారి కృష్ణ,రంగన్న యాదవ్,సహాయ కార్యదర్శి రవికుమార్,కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, బాలకృష్ణయ్య,శంకర్,రాజు, రవికుమార్,సందీప్,తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top