లింగారెడ్డి గూడాలో రూ. 10 లక్షలతో అండర్ డ్రైనేజీ పనులు..
అండర్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ ఎంసి ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ ఎర్రోళ్ల అశోక్
(పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
కాలువ నిర్మాణం లేక ఎదురవుతున్న ఇబ్బందులకు చేపడుతూ ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డిగూడెం గ్రామంలోని పదవ వార్డులో అండర్ డ్రైనేజీ పనులను గ్రామ సర్పంచ్ ఎంసీ ప్రవీణ్ కుమార్, ఉపసర్పంచ్ ఎర్రోళ్ల అశోక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూ. పది లక్షల వ్యయంతో ఈ కాలువ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కాలువ నిర్మాణం పూర్తయితే గ్రామంలో దుర్గంధ సమస్య పరిష్కారం అవుతుందని వారు వెల్లడించారు. గ్రామాభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్ రెడ్డి, వార్డు సభ్యులు వట్టెల మల్లేష్ యాదవ్, దీపిక, వీరేష్ గౌడ్, ఎర్రోళ్ల మమత, అరుణ్ కుమార్, శశాంక్ గౌడ్, మాధవి, గణేష్, బాలమణి, కందూరి అంజయ్య గౌడ్, పంతులు లక్ష్మయ్య, అప్పన్న గారి భాస్కర్ రెడ్డి, గోదా రమేష్ యాదవ్, నరేందర్ రెడ్డి, పకీర్ భాష, రంగంపల్లి నారాయణ గౌడ్, లక్ష్మయ్య యాదవ్, యాదయ్య, జంగయ్య, రామకృష్ణ, శేఖర్ గౌడ్, ధనుంజయ, ఖాజా పాషా, శ్రీకాంత్ గౌడ్, హరికృష్ణ యాదవ్, రవి, గంటల శంకరయ్య, షాబాద్ శంకరయ్య, అశోక్, శ్రీను, కార్తీక్, అంజయ్య, నారాయణ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు..
