ఇంటర్ ఫలితాల్లో ఎస్ ఆర్ కాలేజీ లో బాలికల విజయకేతనం
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి
ఇంటర్ ఫలితాలు నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఎస్ ఆర్ కళాశాల విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో విజయకేతనం ఎగురవేశారు. బైపిసి మొదటి సంవత్సరంలో ఈ ఆరాధ్య 438 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు సఫా మహిన్ 437 ,జి అలేఖ్య 436 ,ఆయేషా రీదా 434, నవ్య 432 మార్కులు సాధించారు. ఎంపీసీ విభాగంలో రహీం 465 మార్కులతో రాష్ట్రస్థాయి బ్యాంకు సాధించారు. ఎస్ హర్షిని 464 ,ఎస్ సంజన 461, కె శ్రీవన్య 461 ,రక్షిత 460 మార్కులు సాధించారు ద్వితీయ సంవత్సరంలో డి శ్రీనిధి 993 ఆయేషా 990 ,శ్రీజ 990 ,శిరీష 990 ,శృతిక 989, లక్ష్మీప్రసన్న 989 మార్కులు సాధించారు. బైపిసి విభాగంలో బి శ్రీలక్ష్మి 993 ,డి గౌరీ 992, శ్రీజ 989 మార్కులు సాధించారు. విద్యాసంస్థల చైర్మన్ వరదా రెడ్డి గోవర్ధన్ రెడ్డి, జోనల్ ఇన్చార్జ్ నగేష్ యాదవ్, డిన్ రాందాస్, ప్రిన్సిపల్ నరేందర్ రెడ్డి ఫలితాలు సాధించిన విద్యార్థిలను అభినందించారు.
