మాజీ ఏఎంసీ డైరెక్టర్ నంద్యాల వెంకటేశ్వరావు మృతి

August 19, 2026 | ఆంధ్రప్రదేశ్

పయనించే సూర్యుడు ఆగస్టు 19 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) కాట్రేనికోన: కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామానికి చెందిన ముమ్మిడివరం మార్కెటింగ్ కమిటీ మాజీ డైరెక్టర్ నంద్యాల వెంకటేశ్వరావు(56) బుధవారం ఉదయం కాకినాడ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.ఆయనకు గుండెపోటు రావడంతో ట్రస్ట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. గతంలో రెండుసార్లు పంచాయతీ వార్డు మెంబర్ గా గెలుపొందారు.చెయ్యేరు రామలింగేశ్వర ఆక్వా అసోసియేషన్ గత ప్రెసిడెంట్ జిల్లాకి వెళ్లిన సందర్భంగా అప్పటినుండి ఇప్పటివరకు అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నంద్యాల వెంకటేశ్వరరావు పనిచేశారు. రైతు కార్యక్రమాలలో అనేక కార్యక్రమాలు తనదైన శైలిలో చేపట్టారు. ఎన్నడూ లేని విధంగా ఆక్వా సర్వీసులన్నిటికీ సబ్సిడీ 1.50 రూపాయలు వచ్చేలా చేయడం అభినందనీయం. అటువంటి అకాలమరణం అక్వా రైతులకు చాలా లోటు. గ్రామ సంఘం తరుపున, స్టేట్ ఆక్వా అసోసియేషన్ సెక్రటరీ తరపున సంతాపం తెలియజేస్తున్నారు. వెంకటేశ్వరరావు మృతి వార్త తెలిసిన వెంటనే ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఫోన్లో కుటుంబ సభ్యులను ఓదార్చారు. మండల టిడిపి అధ్యక్షుడు చెల్లి సురేష్, మాజీ అధ్యక్షుడు నడింపల్లి సుబ్బరాజు, మత్స్యశాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వరావు, వటపల్లి నాగేంద్ర, నాగభూషణం, శ్రీనివాస్, నంద్యాల చంటి, సుంకర నాగేశ్వరరావు తదితరులు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి

🌐 Select Language:
📰 ePaper