ముధోల్ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి సన్మానం
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి
ఇటీవలే ఎన్నుకోబడ్డ ప్రింట్ &ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గానికి బుధవారం మండల బీజేపి నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ముందుగా అధ్యక్షులు సునీల్ జోందలే (ప్రజాపక్షం రిపోర్టర్ ), ఉపాధ్యక్షులు సోన్ కాంబ్లె (తెలంగాణ వెన్నెల వాక్కు)రిపోర్టర్, కార్యదర్శి రమేష్ (ఆంధ్రప్రభ రిపోర్టర్), సంయుక్త కార్యదర్శి శరత్ (పోరు తెలంగాణ రిపోర్టర్) లను సన్మానించిన తధనంతరం సభ్యులైన మురళి గౌడ్(ప్రజాదర్బార్ రిపోర్టర్), మల్లేష్ (ప్రజాదర్బార్ రిపోర్టర్)జాదవ్ నాగేష్ (ప్రైమ్ న్యూస్ ఛానల్),బషీర్ (మున్సిఫ్ రిపోర్టర్ ),విజయ్ (విజన్ ఆంధ్ర రిపోర్టర్ )దుర్గాప్రసాద్(సూర్య రిపోర్టర్) లను సన్మానించారు. ఈ సందర్బంగా అధ్యక్షులు సునీల్, సభ్యులు మాట్లాడుతూ నిస్వార్థంగా పని చేస్తామని ధీమా వ్యక్తం చేశారు .నిరుపేదల సమస్యలను అధికారుల వరకు తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ఐక్యంగా ఉండి తమ కార్యాచరణనను ముందుకెళ్తామని పేర్కొన్నారు. తమకు అందరూ సహకరాలు అవసరమని వెల్లడించారు.అనంతరం బీజేపి నాయకులు మాట్లాడుతూ తమ విధికి వన్నె తీసుకుకురావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం నుండి ఏదైనా పథకాలు ఏవైనా అందియ్యడానికి స్థానిక ఎమ్మెల్యే చొరవతో తప్పకుండా ప్రభుత్వ ప్రతి ఫలాన్ని చేకూర్చేలా కృషి చేస్తామని హామీనిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు ధర్మపురి సుదర్శన్,తాటివార్ రమేష్,వరగంటి జీవన్,గ్రామ ఉప సర్పంచ్ సాయి, బీజేపి మండల సోషల్ మీడియా కన్వీనర్ దర్బార్ నరేష్,విట్టల్, దాతత్రి తదితరులు పాల్గొన్నారు.