PS Telugu News
Epaper

మంత్రి రాకతో గార్లఓడ్డు గ్రామంలో సందడి

📅 16 Apr 2026 ⏱️ 2:21 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి రాకతో గార్లఓడ్డు గ్రామంలో సందడి నెలకొంది.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

ఏన్కూర్: మండల పరిధిలోని గార్లఓడ్డు గ్రామంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ భూక్య లాలు నాయక్, గార్లఓడ్డు గ్రామ సర్పంచ్ భూక్య నర్సి లాలూ దంపతుల కుమారుడు చందూలాల్, సక్కుబాయి
వివాహ మహోత్సవం సందర్భంగా నూతన వధూవరులను మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ నూతన వస్త్రాలు బహుకరించి ఆశీర్వదించారు. మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన గార్లఒడ్డు
సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, మంత్రి ఆశీర్వాదం పొందే కార్యక్రమంలో నూతన వధూవరులను మంత్రికి పరిచయం చేశారు. మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డికి మార్కెట్ మాజీ చైర్మన్ భూక్య లాలు నాయక్
ఘన స్వాగతం పలికారు. మంత్రి రాక సందర్భంగా గార్లఓడ్డు గ్రామంలో సందడి కనిపించింది. ఈ సందర్భంగా మంత్రి అందరినీ ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

Scroll to Top