ఆదర్శ పూర్వ విద్యార్థుల ప్రతిభ
స్టేట్ 3,6,7 ర్యాంకుల సాధించిన విద్యార్థులు
పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 ప్రతినిధి గ్రంధి నానాజీ
ఆదర్శ మా విద్యకు పునాది… ర్యాంక్ విద్యార్థులు…
విద్యార్థులను అభినందించిన ఆదర్శ విద్యాసంస్థల చైర్మన్ కనకరాజు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ ఫలితాలలో ఆదర్శ పూర్వ విద్యార్థులు సత్తా చాటారు. స్టేట్ లో 3,6,7 ర్యాంకులను సాధించారు. ఆదర్శ హై స్కూల్ తరఫున ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలో అత్యున్నత స్థాయిలో ప్రతిభ చాటిన పూర్వ విదార్థులను ఆదర్శ స్కూల్ ప్రాంగణంలో చైర్మన్ కనకరాజు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.ఇంటర్ 2వ సంవత్సరం బైపీసీలోపి.సరయు 991 /1000మార్కులు స్టేట్ 3 వ ర్యాంక్,ఎస్.చరిష్మా 988/1000 మార్కులు 6వ ర్యాంక్,ఇంటర్ 1వ సంవత్సరం ఎంపీసీ లో వై. దీప్తి 463/470మార్కులు 7వ ర్యాంక్ సాధించారు. స్టేట్ 3వ ర్యాంక్ సాధించిన సరయు గతంలో గోకవరం మండలంలో మొదటి స్థానం సాధించింది. ఈ విజయం ఆదర్శ విద్యాసంస్థల పునాదే కారణమని విద్యార్థులు తెలిపారు. అతి తక్కువ ఫీజులతో ఉన్నతమైన విద్యను మాకు ఆదర్శ అందించిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ అతి పేద కుటుంబం నుంచి వచ్చిన మా పిల్లలకు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించడానికి ఆదర్శ విద్యాసంస్థ ఈ యొక్క బోధనా విధానం, క్రమశిక్షణ కారణమన్నారు. చైర్మన్ కనకరాజు మాట్లాడుతూ ఆదర్శ స్కూల్ పేరును నిలబెట్టినందుకు గర్వంగా ఉందని, అదేవిధంగా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను విద్యార్థులను దీవించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ సెక్రెటరీ డాక్టర్ నాగమణి, కోఆర్డినేటర్ శ్రీనివాస్, హెడ్మాస్టర్ సత్యనారాయణ మరియు అధ్యాపక బృందం పాల్గొని విద్యార్థులను అభినందించారు.
