ఇంటర్ లో ప్రతిభ చాటిన పేద విద్యార్థిని ఎం ఈ సి లో 955 మార్కులు సాధించిన వైనం . చదువు లో రానిస్తున్న చెయ్యేరు విద్యార్థిని తేజస్విని
పయనించే సూర్యుడు ఏప్రియల్ 16 : ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు పంచాయతీ పరిధిలో జిల్లగుంట కు చెందిన కటారి తేజస్విని బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో తన ప్రతిభ ను చాటింది. ద్వితీయ సంవత్సరం ఎం ఈ సి గ్రూపులో 955 మార్కులు సాధించడం గర్వకారణం అని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, పంచాయతీ డిప్యూటీ ఈఈ అన్యం రాంబాబు, మాజీ సర్పంచ్ లు చెల్లి సురేష్, దొరబాబు అభినందించారు. తండ్రి బాల రాజు ఎం జి ఎన్ అర్ ఈ జి ఎస్ లో టెక్నికల్ అసిస్టెంట్ గా పని చేస్తూ రోజు చెయ్యేరు నుండి అమలాపురం కాలేజీ కి తీసుకొని వెళ్ళి న కష్టాన్ని మర్చి పోయా అని సంతోషం వ్యక్తం చేసారు.. చదువు కొనే వారిని ప్రోత్సాహంచే పంచాయతీ రాజ్ డిప్యూటీ ఈఈ అన్యం రాంబాబు స్ఫూర్తి అని, అయన కు ఉమ్మడి రాష్ట్రము లో 1993 లో రాష్ట్ర స్థాయిలో 10 వ ర్యాంక్ సాధించారని, ఆయన ను ఆదర్శం తీసుకుని చదివానని, పరీక్షల కు 20రోజులు ముందు కిచెన్ లో మూకుడి లో ఆయిల్ వంటి పై పడి పెద్ద గాయం అయ్యిందని. లేదంటే ఇంకా మంచి మార్కులు వచ్చేవని తెలుపుతూ,చార్టెడ్ అకౌంట్ కోర్స్ పూర్తి చేసి భవిష్యత్ లో గ్రూప్ 1 అధికారిగా ప్రజలకు సేవ చేయాలన్నదే తన లక్ష్యం అని తేజస్విని తెలిపింది..