తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఆనందసాగర్
పయ నించే సూర్యుడు ఏప్రిల్ 16 ముమ్మిడివరం గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
పి.గన్నవరం నియో జకవర్గ తెలుగు దేశం పార్టీ కోకన్వీనర్ మోకా ఆనంద సాగర్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యద ర్శిగా ఎంపికయ్యారు. ఆయన తెదేపా రాష్ట్ర అధి కార ప్రతినిధిగా, రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ డైరెక్టరుగా పదవులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నతి పొందారు. కాట్రేనికోనకు చెందిన ఆయన 1994లో ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కార్యనిర్వాహక కార్యదర్శిగా పార్టీ ఉన్నత స్థానం కల్పించడంపై ఆయన మాట్లాడుతూ తనకు అప్పజెప్పిన బాధ్య తలను చిత్తశుద్ధితో నెరవేరుస్తానని తెలిపారు.