PS Telugu News
Epaper

మార్క్ ఫేడ్ ఎండి ని కలిసిన ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్

📅 17 Apr 2026 ⏱️ 2:49 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

మొక్కజొన్న సబ్ సెంటర్లఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి

అవసరమైన చోట్ల సబ్ సెంటర్లు ప్రారంభిస్తాం

మొక్కజొన్న రైతుల పంటను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేస్తామని, ఈపాటికి అన్ని మండలాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ లో మార్క్ఫెడ్ డిఎం శ్రీనివాస్ రెడ్డిని కలిసిన సందర్భంగా మాట్లాడారు. ముధోల్ నియోజకవర్గం లో ఎక్కువ మొత్తంలో మొక్కజొన్న పంట ఉందని, భారీ వర్షాలతో రైతుల నష్టపోయారని ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేపడితే కొంతైనా మేలు జరుగుతుందని ఆయన డిఎంకు తెలియజేశారు. బహిరంగ మార్కెట్లో ధర తక్కువగా ఉన్నందున ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్మితే క్వింటాలుకు 700 రూపాయల వరకు అధిక ధర వస్తుందని, వెంట వెంటనే కొనుగోలు చేపట్టి, పంట అమ్మినా డబ్బులను రైతుల ఖాతాల్లో సత్వరం వేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి మండలంలో ప్రధాన కొనుగోలు కేంద్రాలతో పాటు సబ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే పంట అమ్ముకోవడానికి ఇబ్బందులు ఉండవని, ఎక్కడ ఎక్కడ సబ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలో ఆయన రాతపూర్వకంగా ఎండికి వివరించారు. నియోజకవర్గంలో 30కి పైగా సబ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా అమ్మకానికి పంట తెచ్చిన వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు చేపడతామన్నారు. మొక్కజొన్న రైతులు ఆందోళన పడకుండా తమ పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

Scroll to Top