కూతురు ఆనందిత జన్మదినం సందర్భంగా 28వసారి రక్తదానం చేసిన వాడేకర్ లక్ష్మణ్

August 20, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో : రక్తదానంతో జన్మదిన వేడుకలు.. యువతకు ఆదర్శంగా వాడేకర్ లక్ష్మణ్ భైంసా: జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమంగా మలచుకుంటూ కూతురు ఆనందిత పుట్టినరోజు సందర్భంగా 28వసారి స్వచ్ఛంద రక్తదానం చేసి యువతకు స్ఫూర్తిగా నిలిచారు భైంసాకు చెందిన జేసీ వాడేకర్ లక్ష్మణ్.ఆనందిత ఫౌండేషన్ చైర్మన్, మోటివేషనల్ స్పీకర్, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ రీజియన్–19 ప్రెసిడెంట్, జేసీఐ నిర్మల్ స్పూర్తి ప్రెసిడెంట్‌గా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న వాడేకర్ లక్ష్మణ్.. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి వెంటనే స్పందిస్తూ తన వంతు సహాయాన్ని అందిస్తున్నారు.“మన పుట్టినరోజు వేడుకలకు అర్థం రావాలంటే.. ఒకరి ప్రాణాన్ని కాపాడే సేవ చేయాలి” అనే సందేశంతో కూతురు ఆనందిత జన్మదినాన్ని రక్తదానంతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా యువత రక్తదానానికి ముందుకు వచ్చి మరెందరో ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు.అంతేకాకుండా ఆనందిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ తదితర అంశాలపై ఉచిత శిక్షణ అందిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నారు.కూతురు జన్మదినాన్ని సామాజిక సేవతో జరుపుకుంటూ 28వసారి రక్తదానం చేసిన వాడేకర్ లక్ష్మణ్‌ను పలువురు అభినందిస్తూ, యువతకు ఆయన సేవా స్ఫూర్తి ఆదర్శమని ప్రశంసించారు.

🌐 Select Language:
📰 ePaper