ఏరుగట్ల మండలంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు.
పయనించే సూర్యుడుD..20.8.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. *ఈ రోజు గురువారం రోజున ఏర్గట్ల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 82 వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రధానిగా రాజీవ్ గాంధీ యున్నప్పుడు ఐటీ మరియు టెలికాం విప్లవం తెచ్చి దేశములో మొట్టమొదట ప్రవేశపెట్టినారు. దేశంలో ఓటింగ్ వయసును 21 సంవత్సరాలు నుండి 18 సంవత్సరాలకు తగ్గించటం, విద్య సంస్కరణలు జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం, పంచాయతీ రాజ్ వ్యవస్థ పటిష్ట పరుస్తూ స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళలకు రిజర్వేషన్ల ప్రతిపాదన, ఆర్ధిక సరళీకరణ, శాంతి ఒప్పందాలు కుదిర్చి ప్రాంతీయ జాతీయ విభేదాలు లేకుండా రాజకీయ పర నిర్ణయాలు తీసుకొన్న గొప్ప నాయకులు రాజీవ్ గాంధీ అని దేశములో శాంతి కోసం ప్రాణాలు కోల్పోయారు అని స్మరించుకున్నారు. ఇట్టి కార్యక్రమములో మండల, గ్రామ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.