టి యు సి ఐ ఆధ్వర్యంలో కార్మిక సమస్యలతో కూడిన వినతి పత్రం సబ్ సబ్ కలెక్టర్ ఇవ్వడం జరిగింది.

August 20, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.208.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) జాతీయ కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా ఆర్మూర్ డివిజన్ కేంద్రంలో 200 మంది గ్రామపంచాయతీ కార్మికులు తోజంబి హనుమాన్ గ్రౌండ్ నుండి ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయం వెళ్లి కార్మికులతో కలిసి కార్యాలయం ముందు ధర్నా చేసి కార్మిక సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సబ్ కలెక్టర్ కి ఇవ్వడం జరిగింది, ఈ సందర్భంగా కార్మికుల ఉద్దేశించి ఏం.ముత్తన్న ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను మే 2026 సూచిక ప్రకారంగా 39 39వేల 379 రూపాయలు కనీస వేతనాలుగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,,ఈ కార్యక్రమంలో,,TUCI నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా జిల్లా ఉపాధ్యక్షుడు, వి సత్తెమ్మ , కె. రాజేశ్వర్, జిల్లా ఉపాధ్యక్షుడు జి.అరవింద్, జిల్లా నాయకులు నాగరాజ్, జి.కిషన్ అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా అధ్యక్షుడు,మండల నాయకులు నజీర్, గ్రామపంచాయతీ నాయకుడు గంగాధర్, లక్ష్మి, దేవన్న అబ్రహం, తదితరులు పాల్గొన్నారు,

🌐 Select Language:
📰 ePaper