షాద్నగర్ మున్సిపాలిటీ రెండో వార్డు నీటి కొరత తీరుస్తున్న వార్డ్ కౌన్సిలర్ బచ్చలి నరేష్
( పయనించే సూర్యుడు ఆగస్టు 21 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)షాద్నగర్ మున్సిపాలిటీ రెండో వార్డు స్టేడియం దగ్గర గల స్మశాన వాటికలో నీటి ఇబ్బంది ఉండడంవల్ల ప్రజల సౌకర్యార్థం ఈరోజు రెండో వార్డ్ కౌన్సిలర్ బొచ్చలి నరేష్ ముందుకు వచ్చి బోర్ పాయింట్ చూపించడం జరిగింది. కౌన్సిలర్ మాట్లాడుతూ.. రెండో వార్డు పరిధిలో ఎలాంటి సమస్య ఉన్న నా ముందుకు వస్తే ఖచ్చితంగా నెరవేర్చుతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో బచ్చలి రమేష్, కొండే యాదయ్య, రవికుమార్, బైరమోని రవి, తదితరులు పాల్గొన్నారు.