ఆర్టీసీ కార్మికుల 32 ప్రధాన డిమాండ్లను ఏకకాలంలో అంగీకరించిది. బండి రమేష్
ష్పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 28 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
ప్రతి పేదవాడి ఆకాంక్షను నెరవేర్చేలా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల 32 ప్రధాన డిమాండ్లను ఏకకాలంలో అంగీకరించి ఆమోదించినందుకు, సమ్మె విరమింప చేసినందుకు కృతజ్ఞతగా మంగళవారం కేపీహెచ్బీ కాలనీ బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో కార్మికులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బండి రమేష్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సమ్మె సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళు అపరిష్కృతంగా ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యలను కేవలం రెండు రోజుల్లోనే పరిష్కరించి వారి డిమాండ్లకు అంగీకరించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల వెటకార ధోరణితో వ్యవహరించిందన్నారు. శంకర్ గౌడ్ తొందరపాటు నిర్ణయంతో ఆత్మహత్యకి పాల్పడడం బాధాకరమన్నారు. అతని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. కార్మికులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
