PS Telugu News
Epaper

అన్నారంలో చైల్డ్ సేఫ్టీ వీక్ అవగాహన కార్యక్రమం

📅 28 Apr 2026 ⏱️ 7:57 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పాల్గొన్న సర్పంచ్ లావణ్య రామకృష్ణ

( పయనించే సూర్యుడు ఏప్రిల్ 29 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

ఫరూక్నగర్ మండలం అన్నారం గ్రామంలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా బుధవారం రోజు చైల్డ్ సేఫ్టీ వీక్ టీనేజ్ ప్రెగ్నెన్సీ , ఎల్లోప్మెంట్ అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ లావణ్య రామకృష్ణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ… బాలికలకు టీనేజ్ వయస్సు వరకు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వారికి తగిన జాగ్రత్తలు సూచించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుందని అన్నారు. పౌష్టికాహారం మరియు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు తల్లిదండ్రులకు వివరించారు. పిల్లలు పై చదువులు చదివే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. మరియు వారికి వివాహ వయస్సు కనీసం 18 సంవత్సరాల్లో వరకు పెళ్లి చేయకుండా ఉండాలని సూచించారు. కిషోర్ బాలికలకు మంచి లక్షణాల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య రామకృష్ణ తో పాటు గ్రామ సెక్రెటరీ వివో ఏ అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్ మరియు బాలికలు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top