భీంగల్ పట్టణంలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారి కనుగోలు కేంద్రం
పయనించి సూర్యుడు 28 ఏప్రిల్ 20 26 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్
పట్టణంలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. లారీల కొరత ఉండడం వలన లారీ కొరత లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. రైస్ మిల్లులతో మాట్లాడి వరి లోడైన లారీలను తొందర తొందరగా ఖాళీ చేసి కొన్ని కొనుగోలు కేంద్రాలకు పంపేలా చూడాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. రైతులతో మాట్లాడి లారీల కొరత లేకుండా చూస్తామని అన్నారు. దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేయాలని రైస్ మిల్ యజమానులకు ఫోన్లో మాట్లాడి కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది సార్ వెంట మెప్మా సిబ్బంది ఉన్నారు
