కొత్తపేట మండల బీజేపీ ప్రశిక్షణ కార్యక్రమం
పయనించే సూర్యుడు ఏప్రిల్ 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఆర్యవైశ్య కల్యాణమండపం లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండల బీజేపీ అధ్యక్షులు సంపతి కనకేశ్వరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యనందం పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి పార్టీ కార్యక్రమం ప్రారంభంభించారు. కార్యవిస్తరణ గురించి అడబాల సత్యనారాయణ, బీజేపీ చరిత్ర గురించి చట్రతి రాంబాబు, కార్యాపద్ధతి గురించి రామ వర్మ, కేంద్ర ప్రభుత్వ పధకాలు గురించి బాబీ మాస్టర్, సోషల్ మీడియా గురించి చిలకమర్తి కస్తూరి, రాష్ట్ర బీజేపీ నాలుగు కార్యక్రమాలు గురించి సలాది వీరబాబు కార్యకర్తలు కి వివరించారు ప్రభుత్వం ప్రకటించే పధకాలు లబ్దిదారులకు అందేలా చూడాలి అని బూత్ కమిటీలు పూర్తి చేయాలి అని తెలిపారు. ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ డైరెక్టర్ గొల కోటి వెంకటేశ్వరరావు, వానపల్లి పల్లాలమ్మా దేవస్థానం డైరెక్టర్ బల్ల దుర్గాలక్ష్మి రాజు, ఆత్మ కమిటీ డైరెక్టర్ పాలాటి మాధవ స్వామి, రాష్ట్ర యువ మోర్చా నాయకులు పాలూరి జయ ప్రకాష్ నారాయణ, కోటిపల్లి సుబ్రహ్మణ్యం, జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షులు కోటిపల్లి దామోదర్, ఓబీసీ మోర్చా నాయకులు దొడ్డిపట్ల శ్రీనివాస్, sc మోర్చా జిల్లా అధ్యక్షులు ఫోనుగుపాటి శ్రీనివాస్, సిద్ధంశెట్టి గంగారావు,రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు చిట్టూరి రాజేశ్వరి, జిల్లా బీజేపీ కార్యదర్శి మోకా ఆది లక్ష్మి, సబ్బవరపు సత్యనారాయణ, వలపశెట్టి కిరణ్, ఇళ్ల పల్లంశెట్టి, ఉద్దరాజు ప్రసాద్ రాజు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా కొత్తపేట మండలం లో జరిగిన సమావేశము శిక్షణ తరగతులపై వివిధ కాలాంశంలపై వ్యక్త మాట్లాడటం జరిగింది ఇందులో భాగంగా ఇంటర్మీడియట్ ఫలితాల్లో 988/1000 అత్యధిక మార్కులు సాధించిన కొత్తపేట కమ్మిరెడ్డి పాలెం గ్రామ ఏడిద రాజుగారు అమ్మాయి ఏడిద శ్రీ వర్షిని సిద్ధార్థ జూనియర్ కాలేజీలో మంచి మార్కులు సాధించినందుకు భారతీయ జనతా పార్టీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరు సత్యానందం జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు పునుగుపాటి శ్రీనివాసరావు జిల్లా ప్రధాన కార్యదర్శి చీకురుముల్లి శ్రీనివాస్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వలకోటి వెంకటేశ్వరరావు లక్ష్మీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం నాయకులు దొడ్డిపట్ల శ్రీనివాస్ మరియు దేవగుప్తపు నాగేంద్ర శాలివాహన నాయకులు వివిధ రాష్ట్ర జిల్లా పదాధికారులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ అభినందించారు సిద్ధార్థ కాలేజీ యాజమాన్యం వారికి బోధన బోధనేతర సిబ్బందికి వారికి కృతజ్ఞతలు తెలియ చేయటం జరిగినది అత్యధిక మార్కులు సాధించిన శ్రీ వర్షిని బిజెపి నాయకులు కార్యకర్తలు అభినందించడం జరిగింది
