విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తా: మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్

August 24, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో : ఝరి బి గ్రామంలోని హైస్కూల్‌ను బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ సందర్శించి విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యాభ్యాసం, పాఠశాలలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులు పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని, రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించాలని చైర్మన్‌కు వివరించారు. ఉపాధ్యాయుల కొరత కారణంగా తమ చదువులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థుల సమస్యలను శ్రద్ధగా విన్న సిందే ఆనందరావు పటేల్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల కొరత విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, పాఠశాలకు అవసరమైన రెగ్యులర్ ఉపాధ్యాయులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా అవసరమైన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తానని తెలిపారు.విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

🌐 Select Language:
📰 ePaper