బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం, 10 గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామకం.

August 29, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడుD.29.8.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఆమోదంతో బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గంతో పాటు మండల పరిధిలోని 10 గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించడం జరిగింది.ఈ సందర్భంగా బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సట్ల ప్రవీణ్ (సర్పంచ్, చిట్టాపూర్) మాట్లాడుతు
మండలంని కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడం లక్ష్యంగా నూతన కార్యవర్గం పని చేయాలి అని సూచించారు.నూతనంగా నియమితులైన మండల కార్యవర్గ సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని కోరుతున్నాము.

🌐 Select Language:
📰 ePaper