ఓడలరేవు మత్స్యకారులను కాపాడిన బెంగాల్ యువకులకు బిజెపి సన్మానం

August 29, 2026 | తెలంగాణ

ప యానించే సూర్యుడు ఆగస్టు 29 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అల్లవరం మండలం ఓడలరేవు కొమరగిరి పట్టణానికి చెందిన మత్స్యకారులు ఇటీవల వేటకు వెళ్లి గల్లంతయ్యారు. గల్లంతైన మత్స్యకారులను మానవతా దృక్పథంతో కాపాడిన పశ్చిమ బెంగాల్ కు చెందిన ముగ్గురు యువకులు బెండమూర్లంక సెంటర్ కు రావడంతో వారిని బిజెపి అల్లవరం మండల అధ్యక్షులు కట్టా నారాయణమూర్తి సన్మానించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సన్మానం పొందిన ముగ్గురిలో ఒకరు పశ్చిమ బెంగాల్ మండల అధ్యక్షులుగా ఉండడం గమనార్హం. దేశ సేవలోనైనా, మానవతా సేవలోనైనా ముందుండి నడిపించే వారిలో బిజెపి ముఖ్యపాత్ర ఉంటుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో SIR కన్వీనర్ సంసాని రత్నకుమార్, SIR కో కన్వీనర్ పెద్దిరెడ్డి శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు వాసంశెట్టి దుర్గ వరప్రసాద్, బజరంగ్దళ్ నాయకులు పట్టా నాగరాజు, చిట్టూరి సత్యమధు, గంటా సత్తిబాబు, కోపనాతి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper