భీంగల్ మండలంలోని బెజ్జోరా కొత్త తండా తాళ్లపల్లి గ్రామాలలోనికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ మంజూరు పత్రాలు పంపిణీ..

పయనించే సూర్యుడుD.9.9.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్..భీంగల్ మండలంలోని బెజ్జోరా,కొత్త తండా, తాళ్ళ పల్లి గ్రామాలలోని నిరుపేద లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ మంజూరు పత్రాలు పంపిణీ చేయడం జరిగింది
మొదటి దశలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేసి ఇంకను అదనంగా జిల్లా కలెక్టర్ పంపించగా మంజూరు కాగా ఈరోజు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయడం జరిగింది..త్వరితగతిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించాలని ఎంపీడీవో సంతోష్ కుమార్ లబ్ధిదారులను కోరారు కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు,జీపీ పాలకవర్గ సభ్యులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు