ఫౌండేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ క్రీడాకారుడికి సన్మానం

September 15, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు గాంధారి 16/09/26 జాతీయ క్రీడా ప్రాధికార సంస్థ అయినా స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా కబడ్డీ అకాడమిలో సీటు సాధించించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేట్ సంగం పూర్వ విద్యార్థి భూక్యా అర్జున్ ను బామన్ నాయక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ కో ఫౌండర్ లక్ష్మణ్ రాతోడ్ పేట్ సంగం ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో తోటి క్రీడాకారులతో కలిసి సన్మానించారు, గత జులై మాసంలో హైదరాబాద్ లోని గాచ్చిబౌలి క్రీడా అకాడమీ లో జరిగిన ఎంపిక పోటీలో శారీరక దారుడ్యా ఆధారంగా ఆధారంగా నిర్వహించిన సమర్థ్య పోటీలో అద్భుత క్రీడా ప్రదర్శన ద్వారా ఎంపిక చేసి నట్లు అయన తెలిపారు, దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి క్రీడాకారులు అకాడమి ప్రవేశలకోసం పోటీ పడగా అర్జున్ అద్భుత ప్రదర్శన ద్వారా ఎంపిక చేసారు. అర్జున్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార కబడ్డీ అకాడమీ మహబూబ్ నగర్ లో శిక్షణ పొందుతున్నారు.గాంధారి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు, అర్జున్ కు బామన్ నాయక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ చీఫ్ పాట్రన్ గుగ్లోత్ సురేందేర్, అధ్యక్షురాలు సెవెంత రాతోడ్ బాల కృష్ణ తదితరులు అభినందించారు

🌐 Select Language:
📰 ePaper