బొజ్జ గణపయ్యను దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు

September 15, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 15 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్‌పల్లి భారతీయ జనతా పార్టీ కార్యాలయ ప్రాంగణంలో కూకట్‌పల్లి వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో కొలువుదీరిన బొజ్జ గణపయ్యను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు దర్శించుకున్నారు.ఉత్సవాల తొలిరోజు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి దివ్యదర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు రాజేశ్వరరావు ని ఘనంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించారు.అనంతరం వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ కూకట్‌పల్లి వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో గత 51 సంవత్సరాలుగా ఎటువంటి విరామం లేకుండా గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఐదు దశాబ్దాలకు పైగా ఒకే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, భక్తి భావాన్ని తరతరాలకు అందిస్తున్న నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే కాకుండా, ఐక్యత, సేవా భావం, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే గొప్ప వేదికలని ఆయన పేర్కొన్నారు.నేటి యువత కూకట్‌పల్లి వినాయక భక్త బృందం సభ్యులను ఆదర్శంగా తీసుకుని, వారి ఐక్యత, ఓర్పు, సేవా స్ఫూర్తిని స్ఫూర్తిగా పొందాలని రాజేశ్వరరావు పిలుపునిచ్చారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ భక్తి, ధర్మం, సేవా మార్గంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలను తొలగించి, సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదించాలని విఘ్నేశ్వరుడైన శ్రీ బొజ్జ గణపయ్యను ప్రార్థిస్తున్నట్లు వారు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper