భక్తిశ్రద్ధలతో వినాయక చవితి తొలి రోజు పూజా కార్యక్రమం

September 15, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 15 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మన అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు యక్కంటి వెంకటరెడ్డి, గువ్వల శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొని విఘ్నేశ్వరునికి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా యక్కంటి వెంకటరెడ్డి మాట్లాడుతూ, విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యత మరింత బలపడాలని కోరుకున్నారు.అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మట్టి వినాయక విగ్రహాలను పూజించి ప్రకృతిని కాపాడాలని, ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలకు దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు.“మట్టి వినాయకులను పూజిద్దాం.. ప్రకృతిని కాపాడుదాం” అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు.వినాయక చవితి ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు

🌐 Select Language:
📰 ePaper