డ్రైనేజీ పనులను ప్రారంభించిన అన్నారం సర్పంచ్ లావణ్య రామకృష్ణ
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 16 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ గ్రామపంచాయతీ నిధులతో అన్నారం గ్రామంలోని 3వ వార్డులో డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. గ్రామ ప్రజల పారిశుధ్య సమస్యలను పరిష్కరించేందుకు చేపట్టిన ఈ పనులతో మురుగు నీటి సమస్యకు పరిష్కారం లభించనుందని స్థానికులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీఓ జయంత్ రెడ్డి హాజరై డ్రైనేజీ పనులను ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ లావణ్య రామకృష్ణ, ఉప సర్పంచ్ వి. శివశంకర్ యాదవ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్ , 5వ వార్డు సభ్యుడు జి. పవన్ కుమార్, 2వ వార్డు సభ్యుడు జి. శ్రీశైలం యాదవ్, 4వ వార్డు సభ్యుడు ఎం. గౌరీ శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..