కృష్ణవేణి పాఠశాలలో హిందీ దినోత్సవ వేడుకలు

September 15, 2026 | తెలంగాణ

ప్రిన్సిపల్ రఫత్ సుల్తానా ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు

( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 16 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)స్థానిక కృష్ణవేణి ఉన్నత పాఠశాల భాగ్యనగర్ మంగళవారం పాఠశాల ఆవరణలో హిందీ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థుల విద్యార్థులు హిందీ వాసుల సంబంధించిన ఉపన్యాసాలను మరియు నాటికలను ఎంతో చక్కగా ప్రదర్శించారు హిందీ భాష వివిధ భాషల ప్రజలకు ఒక వంతెన మాదిరిగా ఉంటుందని స్వేచ్ఛగా వారు తమ యొక్క భావాలను తమ మాతృభాష రానివారికి వ్యక్తపరిచే విధంగా ఉంటుందని హిందీ భాషను అందరు చదవడం మాట్లాడడం నేర్చుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్ రఫత్ సుల్తానా మాట్లాడుతూ హిందీ ప్రాముఖ్యత ను చక్కగా వివరించారు ప్రిన్సిపల్ మాట్లాడుతూ… హిందీ భాషా దినోత్సవం ను ప్రతి సంవత్సరం సెప్టెంబరు 14న జరుపుకుంటారు భారత జాతీయోద్యమంలో అఖిల భారతాన్ని జాగృతం చేసి, ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష ఆనాడు దోహద పడినందున గాంధీజీ స్ఫూర్తితో 1949 సెప్టెంబరు 14న రాజ్యాంగంలోని 351 వ అధికరణం 8వ షెడ్యూల్‌లో హిందీని కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా గుర్తిస్తూ పొందుపరిచారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ రోజున హిందీ భాషా దినోత్సవము ను జరుపుకుంటారు.అని తెలియపరచారు. హిందీ దినోత్సవం పురస్కరించుకుని పాఠశాల హిందీ ఉపాధ్యాయులను సన్మానించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper