హైదర్ నగర్ లోని బాల గణేష్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2000 మందికి అన్నదాన కార్యక్రమం
ప్రజలపై ఆ గణనాథుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి.. కమిటీ సభ్యులు…
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 19 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి హైదర్ నగర్ లోని బాల గణేష్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు ఈ కార్యక్రమానికి ప్రజలు మరియు భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించడం జరిగినది ఈ కార్యక్రమంలో సూర్య ఉదయం తెలుగు దినపత్రిక తెలంగాణ ఎడిటర్ భాషా వారి టీం పాల్గొనడం జరిగినది వారికి కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి తదుపరి స్వామివారి భోజన ప్రసాదాలను స్వీకరించారు, సుమారు ఈ కార్యక్రమంలో 2000 మంది భక్తులు పాల్గొన్నారు అని కమిటీ సభ్యులు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ప్రమోద్ గౌడ్, పోతుల రాజేందర్, హబీబ్ భాయ్, యాసిన్ భాయ్, శ్రీను, మహేష్, సురేష్, విలేకరులు, శ్యాంసుందర్, సునీల్ కుమార్, క్రాంతి, బాల, తదితరులు పాల్గొన్నారు..