తెలంగాణ

ప్రజా కళా జాతరను జయప్రదం చేయండి

ప్రజా కళా జాతరను జయప్రదం చేయండి

ప్రజా కళా ఉద్యమానికి ప్రజలంతా అండగా నిలవాలి


గోడపత్రిక ఆవిష్కరణలో దరువు అంజన్న తదితరుల పిలుపు

పయనించే సూర్యుడు న్యూస్, సెప్టెంబర్ 23, తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్: అరుణోదయ విప్లవ ప్రజా సాంస్కృతిక ఉద్యమం 52 ఏళ్ల ప్రస్థానంలో భాగంగా, విమలక్క 50 ఏళ్ల విప్లవ సాంస్కృతిక ఉద్యమ ప్రస్థానాన్ని స్మరించుకుంటూ నిర్వహిస్తున్న 50 గంటల ప్రజా కళా జాతరను ప్రజలంతా కలిసి జయప్రదం చేయాలని భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ ఉద్యమ కళాకారుడు దరువు అంజన్న పిలుపునిచ్చారు.
ప్రజా కళా జాతర కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను గాజులరామారంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లోని ఆర్‌టీసీ కళ్యాణ మండపంలో మూడు రోజులపాటు ప్రజా కళా జాతరను నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ జాతరలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు చర్చలు, సభలు, కళా ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజా కళల ద్వారా సామాజిక చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు, విప్లవ ప్రజా సాంస్కృతిక ఉద్యమ ప్రస్థానాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.ప్రజా కళా జాతరకు కళాకారులు, మేధావులు, కార్మికులు, యువతతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ప్రజా సాంస్కృతిక ఉద్యమానికి ప్రతి ఒక్కరూ తమ మద్దతును అందించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సలహాదారు, ప్రముఖ ఉద్యమ కళాకారుడు దరువు అంజన్న, అరుణోదయ రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ మల్సూర్, ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రమేష్ పోతుల, సహాయ కార్యదర్శి కామ్రేడ్ రాకేష్‌తో పాటు సౌమ్య, సంధ్య, శ్రీలత, అరుంధతి, మౌనిక తదితరులు పాల్గొన్నారు.ప్రజా కళా జాతరను జయప్రదం చేసి ప్రజా సాంస్కృతిక ఉద్యమానికి మద్దతుగా నిలవాలని నిర్వాహకులు కోరారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS