తెలంగాణ

శబరిమల పాదయాత్రకు పల్లె బ్రదర్స్ రూ.1.10 లక్షల విరాళం

శబరిమల పాదయాత్రకు పల్లె బ్రదర్స్ రూ.1.10 లక్షల విరాళం

( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 24 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )షాద్‌నగర్: శ్రీ రుద్ర ఆర్యనాథన్ గోసేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గురుస్వామి సత్యనారాయణ రెడ్డి నేతృత్వంలో నిర్వహించనున్న శబరిమల మహా పాదయాత్రకు పల్లె బ్రదర్స్ ఆర్థిక సహాయం అందించారు.అక్టోబర్ 12న షాద్‌నగర్ నుంచి ప్రారంభమయ్యే ఈ మహా పాదయాత్రలో సుమారు 100 మంది అయ్యప్ప స్వాములు 37 రోజుల పాటు పాదయాత్రగా శబరిమలకు బయలుదేరనున్నారు. యాత్రలో భక్తులకు అవసరమైన వంట పాత్రల కోసం పల్లె బ్రదర్స్‌లో ఒకరైన పల్లె బాలేశ్వర్ రూ.1,10,000 విరాళాన్ని అందజేశారు.ఈ సందర్భంగా పల్లె బ్రదర్స్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని, భగవంతుడి కృప అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.శబరిమల పాదయాత్రకు సహకారం అందించిన పల్లె బ్రదర్స్‌కు శ్రీ రుద్ర ఆర్యనాథన్ గోసేవా ట్రస్ట్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS