తెలంగాణ

సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఏరుగట్ల మండల అధ్యక్షుడు శివనోళ్ల శివకుమార్ మరియు కాంగ్రెస్ నాయకులు.

సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఏరుగట్ల మండల అధ్యక్షుడు శివనోళ్ల శివకుమార్ మరియు కాంగ్రెస్  నాయకులు.

పయనించే సూర్యుడుD.25.9.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్. ఏర్గట్ల మండల కేంద్రములో ముఖ్యమంత్రి సహాయ నిధి ( CMRF ) 18 మంది లబ్ధిదారులకు 468000 రూపాయల చెక్కులను పంపిణీ చేసిన ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోల్ల శివకుమార్, ఏర్గట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి వీళ్లు మాట్లాడుతూ ఆరోగ్య వైద్య నిమిత్తం హాస్పిటల్ లో ఖర్చులు పెట్టి చికిత్స చేయించుకున్న లబ్ధిదారులు బిల్లులు పెట్టడంతో బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఇంత పెద్ద మొత్తములో రూపాయి ఖర్చు కాకుండా గత BRS పాలనలో మాదిరిగా ఎటు తింపకుండా డబ్బులు మంజూరు చేపించినందుకు లబ్ధిదారులు సునీలన్న కి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే దాసరి లక్షి కి నిమ్స్ హాస్పిటల్ లో ఆరోగ్యరీత్యా ఉచిత వైద్యము కోసం 2 లక్షల 50 వెయ్యిల LOC ఇప్పించటం జరిగిందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోల్ల శివకుమార్ తెలిపారు. ఏవైనా వైద్యం నిమిత్తం ఖర్చు అయితే ఎవరైనా హాస్పిటల్ బిల్లులు యుంటే తెచ్చి ఇస్తే మంజూరు ఇప్పిస్తామని అదే విధముగా నిమ్స్ హాస్పిటల్ లో ఆరోగ్య శ్రీ వర్తించకుంటే ఉచిత వైద్యం కోసం LOC కావాలంటే డాక్టర్ అంచనా విలువ తీసుక వస్తే ఇప్పించే బాధ్యత తీసుకుంటామని శివకుమార్ తెలిపారు. ఇట్టి కార్యక్రమములో ఏర్గట్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS