పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుని స్మరించుకుంటూ
జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి తదితరులు హాజరయ్యారు. బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి మాట్లాడుతూ… గాంధీజీని స్ఫూర్తిగా తీసుకోని నాడు స్వాతంత్ర్య పోరాటం నుండి తెలంగాణ సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటం, త్యాగం చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవలో ముందుకు సాగాలని అన్నారు.బాపూజీ సేవలను స్మరించుకుంటూ పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆందోళన ఇంద్రకరణ్ రెడ్డి మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, , మాజీ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్,కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్,నాయకులు చిలుక రమణ, రామలింగం, గుమ్మిడియాల రాములు తదితరులు పాల్గొన్నారు.