పయనించే సూర్యుడు నవంబర్ 27 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ తాళ్లూరి దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణం పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయి అత్యధిక స్థానాలలో కూటమి ప్రభుత్వం గెలుచుకొని పదవి ప్రమాణ స్వీకారం పట్టణ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో పూర్తయిపోయింది… ఇక పట్టణంలో స్థానికంగా జఠిలనమైన సమస్యల పైన దృష్టి పెట్టవలసిన అవసరం అధికారులకే ఉంది ఎన్నికైన అభ్యర్థులంద రూ కొత్తవారే స్థానిక సమస్యల పైన అవగాహన లేదు ఇక వారికి సూచనలు చేయవలసిన బాధ్యత అధికారులదే కానీ అధికారులు ఆ పనిలో నిమగ్నం అవ్వక ప్రమాణస్వీకారం చేసిన వారిని ఆఫీసులోకి దగ్గరుండి మరి ఆహ్వానించడం సత్కరించడం ఇవన్నీ ప్రజా సమస్యల కు పరిష్కారం అవుతుందా అంటే లేదనే చెప్పాలి గత ఆరు నెలలుగా ప్రభుత్వంలో చలనం లేదు కారణం మునుపటి వార్డు కౌన్సిలర్ అందరూ వారి హోదా పూర్తయిన వేళ వారు చేయవలసిన పనులన్నీ పరిష్కారం కాకుండానే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఆగిపోయి ఒకవైపు పట్టణంలో క్రిక్కిరిసిన ట్రాఫిక్ రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తి చేయవలసిన మొదటి పని రెండవ పని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పట్టణంలో పలు ప్రాంతాలలో మురుగునీటి కాలువ లేవు రోడ్లో అంతంత మాత్రంగానే ఉన్నాయి ఇలాంటి అప్పుడు కొత్తగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన చైర్ పర్సన్ వైస్ చైర్ పర్సన్ మరియు వార్డ్ కౌన్సిలర్లు వారి హోదాకు తగ్గ కుం డా ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు.